“మీషో” పేరుతో గిఫ్ట్ కార్డు వచ్చిందా ? జరా జాగ్రత్త ?

-

ఈ మధ్యన ఈజీ గా డబ్బులు సంపాదించాలన్న ఆశతో చాలా మంది అమాయకులను మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇక తాజాగా మరో రకమైన మోసం చేస్తున్నారంటూ సైబర్ నేరగాళ్లు దొంగబుద్ధిని పోలీసులు అందరికీ తెలిసేలా అవగాహన కల్పిస్తున్నారు. ఆన్లైన్ లో ఈ మధ్యన చాలా పాపులర్ అయిన యాప్ లలో మీ షో కూడా ఒకటి అని చెప్పాలి. ఈ సైట్ పేరుతో కొందరు నేరగాళ్లు లక్షల బహుమతి మీరు గెలుచుకున్నారని ఒక QR కోడ్ ను మీకు పంపించి స్కాన్ చేయమని చెబుతున్నారు. ఇందులో ఎటువని సందేహం కస్టమర్ కి కలుగకుండా ఉండడానికి పేక్ కస్టమర్ కేర్ ను కూడా వీళ్ళే సృష్టించి ఇస్తున్నారు.

ఒకవేళ ఈ ఆఫర్ నిజం అని నమ్మి మీరు కనుక స్కాన్ చేస్తే వెంటనే మీ గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా అమౌంట్ అంతా వారికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి ఉచిత ఆఫర్ లు వస్తే తొందరపడకండి అంటూ సలహా ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news