మంత్రి మల్లారెడ్డికి షాక్.. మంత్రి కోడలు ఆడియో క్లిప్ వైరల్..!

-

తెలంగాణలో ప్రచార పర్వం పీక్స్ కు చేరుకుంది. అందివచ్చిన ఏ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దనే ఉద్దేశంతో అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం గల్లీ గల్లీ చుట్టి వచ్చేస్తున్నారు. ఈసారి గెలిపిస్తే పనులు చేయించే బాధ్యత మాదే అంటూ ప్రామిస్ చేస్తున్నారు. అయితే ఈసారి గెలుపు కోసం తనదైన శైలిలో వినూత్నంగా ప్రచారం చేస్తున్న మంత్రి మల్లారెడ్డికి ఆయన కోడలు ప్రీతి రెడ్డి ఆడియో కాల్ షాకింగ్ గా మారింది. మామను గెలిపించడం కోసం బోడుప్పల్ ప్రాంతంలో ప్రచార బాధ్యతలు తీసుకున్న ఆమెను స్థానికులు అడ్డుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఆమె ఓ నాయకుడితో మాట్లాడినట్లుగా ప్రచారం జరుగుతున్న ఓ ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ మామ కోసం ప్రచారానికి వస్తే అడ్డుకుంటున్నారని దయచేసి అలా చేసి నా పరువు తీయొద్దు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం అంటూ స్థానిక నాయకుడిని బుజ్జగింపుల పర్వానికి దగడమే కాకుండా భవిష్యత్తులో తనకు ఎమ్మెల్యేగా అవకాశం రావచ్చని అందుకోసం నేను స్ట్రాంగ్ కావాల్సిన అవసరం ఉందని దీని కోసం మీరంతా దయచేసి సహకరించాలంటూ ఆమె మాట్లాడిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news