వెనక్కి తగ్గిన ఓపెన్ ఏఐ.. శామ్‌ అల్ట్‌మన్‌ను తిరిగి సీఈఓగా నియమిస్తున్నట్లు ప్రకటన

-

గత వారం ఓపెన్ ఏఐ సీఈవో పదవి నుంచి సామ్ ఆల్ట్​మన్​ను తొలగిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తమ కంపెనీలో సామ్​ను చేర్చుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఎక్స్ వేదికగా ఓ పోస్టు కూడా చేశారు. దీనికి సామ్ కూడా సానుకూలంగానే స్పందించారు. అయితే ఇప్పుడు ఓపెన్ ఏఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. వివిధ వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమైన వేళ సామ్ అల్ట్‌మన్‌ను తిరిగి సీఈఓగా నియమిస్తున్నట్లు ప్రకటించింది.

సేల్స్‌ఫోర్స్‌ మాజీ కో-సీఈఓ బ్రెట్‌ టేలర్‌ అధ్యక్షతన అమెరికా మాజీ ట్రెజరీ సెక్రటరీ లారీ సమ్మర్స్‌, కోరా సీఈఓ ఆడమ్‌ డీ-ఏంజిలోతో కూడిన కొత్త బోర్డు ఏర్పాటు కానున్నట్లు తెలుపుతూ ఓపెన్‌ఏఐ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టింది. ఐ లవ్‌ ఏఐ అని సామ్‌ అల్టమన్‌ కూడా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఓపెన్‌ ఏఐలో తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అలాగే మైక్రోసాఫ్ట్‌తో మరింత బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకునేందుకు సిద్ధంగా తెలిపారు. ఉద్యోగులు, ఇన్వెస్టర్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ఆల్ట్‌మన్‌ను ఓపెన్‌ఏఐ తిరిగి సీఈవోగా తీసుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news