ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధమే.. పుతిన్‌ సంచలన వ్యాఖ్యలు

-

ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడు సయోధ్య కుదురుతుందా అని ప్రపంచం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. యుద్ధం పరిష్కారం కోసం చర్చలను తామెప్పుడూ వ్యతిరేకించలేదని వ్యాఖ్యానించారు.

భారత్‌ అధ్యక్షతన జరిగిన జీ20 దేశాధినేతల వర్చువల్ సదస్సులో పుతిన్‌ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. సైనిక చర్య ఎప్పటికీ విషాదకరమేనన్న పుతిన్.. దీన్ని ఎలా ఆపాలన్న దానిపై కచ్చితంగా ఆలోచనలు చేయాలని అన్నారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలను రష్యా ఎప్పుడూ తిరస్కరించలేదని స్పష్టం చేశారు. ఈ భేటీలో పుతిన్‌ దాదాపు 17 నిమిషాలు ప్రసంగించగా.. పుతిన్‌ మాట్లాడే సమయంలో చైనా, అమెరికా ప్రతినిధులు వర్చువల్ సమావేశంలో లేనట్లు సమాచారం.

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం ఈ సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో పలువురు జీ20 దేశాధినేతలు పాల్గొనగా.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మాత్రం ఈ భేటీకి దూరంగానే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news