నవంబర్ 30 హాలిడే కాదు.. ఓటింగ్ డే : వికాస్ రాజ్

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. మరో ఐదు రోజుల్లో రాష్ట్రంలో ఓటింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన తెలంగాణ ప్రజల మనసు గెలుచుకున్న నాయకులెవరో తేలిపోతుంది. పోలింగ్ దృష్ట్యా నవంబర్ 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ రోజును హాలిడేగా కాకుండా ఓటింగ్​ డే గా గుర్తించి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు.

ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం తక్కువగా నమోదవుతున్నందున పట్టణ ఓటర్లంతా తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని వికాస్ రాజ్ కోరారు. ఈసారి పట్టణంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. పోలీసులు సహా దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని చెప్పారు. తమ ఐదేళ్ల భవిష్యత్​ను నిర్ణయించే ఓటును ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా చాలా జాగ్రత్తగా ఆలోచించి వేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news