విక్రమ్​కు షాక్.. ‘ధృవ నక్షత్రం’ విడుదలకు హైకోర్టు నిబంధన

-

చియాన్ విక్రమ్‌ హీరోగా దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ దర్శకత్వంలో వస్తున్న మూవీ ‘ధృవ నక్షత్రం’. ఈ సినిమా ప్రారంభించినప్పటి నుంచి అడుగడుగునా అడ్డంకులే. ఆరేళ్ల క్రితమే విడుదలకావాల్సిన ఈ సినిమా ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు అన్ని అడ్డంకులు దాటుకుని.. ఈనెల 24వ తేదీన ఈ సినిమా విడుదల చేసేందుకు చిత్ర బృందం రంగం సిద్ధం చేసింది. అయితే తాజాగా ఈ సినిమా విడుదలపై చిత్ర బృందానికి మద్రాసు హైకోర్టు షాక్ ఇచ్చింది.

ఏం జరిగిందంటే.. శింబు హీరోగా గౌతమ్‌ మేనన్‌.. ‘సూపర్‌ స్టార్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఒప్పందం కుదుర్చుకుని,రూ.2.40 కోట్లు తీసుకుని ఆ సినిమా పూర్తి చేయలేదని ఆల్‌ ఇన్‌ పిక్చర్స్‌ తరఫున హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. తమ డబ్బు తిరిగి ఇచ్చే వరకు ‘ధృవ నక్షత్రం’ సినిమా విడుదల చేసేందుకు నిషేధం విధించాలని పిటిషన్‌లో కోరగా.. గురువారం రోజున ఈ పిటిషన్​పై విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు ఓ నిబంధన విధించింది. ఆల్‌ ఇన్‌ పిక్చర్స్‌ నుంచి గౌతమ్ తీసుకున్న డబ్బును శుక్రవారం(నవంబర్‌ 24న) ఉదయం 10.30 గంటల లోపు తిరిగి ఇవ్వాలని, లేదంటే సినిమా విడుదల చేయకూడదని ఉత్తర్వులు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news