KCR అవినీతిపై మోదీ విచారణ జరిపించగలరా?: రాహుల్ గాంధీ

-

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని పార్టీల కీలక నేతలు రాష్ట్రమంతా సుడిగాలి తీయూన పర్యటిస్తూ తమ పార్టీలకు మరింత ప్రజల ఆశీర్వాదాన్ని సంపాదిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ, తెలంగాణాలో బీజేపీ, BRS , ఎంఐఎం ల మధ్యన ఒప్పందం ఉందని అసలు విషయాన్ని బయటపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీగా నన్ను తొలగించారు, అదే విధంగా తెలంగాణాలో కేసీఆర్ అవినీతులపై విచారణ చేయించగలరా ? అంటూ ప్రశ్నించారు రాహుల్ గాంధీ. వీరంతా ఒక జట్టుగా ఏర్పడి కాంగ్రెస్ ను ఓడించడానికి చూస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అంతే కాకుండా కొన్ని చోట్ల కాంగ్రెస్ ఓట్లను చీల్చడానికి ఎంఐఎం పోటీ చేస్తోందంటూ రాహుల్ గాంధీ చెప్పారు. ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం మోదీదే, మోదీ ఎక్కడ ఎంఐఎం ను పోటీ చేయమంటే అక్కడ నిలబడుతున్నారంటూ చెప్పారు రాహుల్ గాంధీ.

ఇక ఈ సందిట్లో సడేమియా లాగా చిన్న చిన్న పార్టీలు మరియు స్వాతంత్ర్య అభ్యర్థుల వలన ఏమైనా నష్టం ఉంటుందా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news