కామారెడ్డిని అభివృద్ధి చేసే బాధ్యతను నేను తీసుకుంటా: కేటీఆర్‌

-

కేసీఆర్‌ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డిని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. తెలంగాణను తెచ్చిన కేసీఆర్‌కు లోకల్‌, నాన్‌ లోకల్ అని ఉంటుందా? అని అన్నారు. తెలంగాణ మినహా.. ఏ రాష్ట్రంలోనూ బీడీ కార్మికులకు పింఛన్లు లేవని చెప్పారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే.. బీడీ కార్మికుల పింఛనుకు కటాఫ్ డేట్‌ తొలగిస్తామని హామీ ఇచ్చారు.

“4.5 లక్షల మంది బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నాం. తొమ్మిదిన్నరేళ్లలో దేశానికి, రాష్ట్రానికి మోదీ చేసింది శూన్యం. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే… పింఛన్లను దశలవారీగా రూ.5 వేలకు పెంచుతాం. జనవరిలోనే కొత్త రేషన్‌కార్డులు ఇస్తాం. రేషన్‌ కార్డుపై సన్నబియ్యం ఇస్తాం. రేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పిస్తాం. అసైన్డ్‌ భూములపై యజమానులకు పూర్తి పట్టా హక్కులు ఇస్తాం.” అని కామారెడ్డిలో నిర్వహించిన రోడ్​ షోలో మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్​ను నమ్మి ఓటేస్తే కష్టాలు కన్నీళ్లు తప్పవని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news