సాగర్ ప్రాజెక్టు వద్ద AP, TS పోలీసుల ఘర్షణ

-

మరో కొన్ని నిమిషాలలోనే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య గొడవ తెరపైకి వచ్చింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఏపీ మరియు తెలంగాణ పోలీసుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి దాటాక ఏపీ పోలీసులు… నాగార్జునసాగర్ వద్దకు చేరుకున్నారు. ఈ తరుణంలో అక్కడే కాపలా ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బందిని గేట్లు తీయాలని కోరారు ఏపీ పోలీసులు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు కూడా అక్కడికి వచ్చేసారు. గేట్లు తీయాలని ఏపీ పోలీసులు కోరగా… ఎందుకు తీయాలని తెలంగాణ పోలీసులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల పోలీసుల మధ్య గొడవ చోటుచేసుకుంది. కొంతమంది ఏపీ పోలీసులు గేట్లు దూకారు. సీసీ కెమెరాలు కూడా అద్వాంసం చేశారు. మొత్తం 26 గేట్లు ఉండగా అందులో 13 గేట్లు తమ వంతు ఏపీ పోలీసులు వాగ్వాదానికి దిగారు. అర్ధరాత్రి ఇలాంటి గొడవలు ఎందుకు చేస్తున్నారని తెలంగాణ పోలీసులు కూడా వారించారు. దీంతో అక్కడ అర్ధరాత్రి ఉద్రక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news