రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 8.52 శాతం పోలింగ్

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 8.52 శాతం పోలింగ్‌ నమోదైంది. వివిధ నియోజక వర్గాల పరిధిలో పోలింగ్‌ సరళిని అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో 5.10 %, మంథనిలో 8.20%, కూకట్‌పల్లిలో 5.43 %, కోదాడలో 10.76%, కోరుట్లలో 11.83 %, ఎల్బీనగర్‌: 5.6% నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మహేశ్వరం: 5%, రాజేంద్రనగర్‌: 15%, శేరిలింగంపల్లి: 8%, చేవెళ్ల (ఎస్సీ): 5%, కల్వకుర్తి: 5%, షాద్‌నగర్‌: 7.2%, ఇబ్రహీంపట్నంలో 8.11 %, కొత్తగూడెంలో 8.33%, వేములవాడలో 9.80%, సిరిసిల్లలో 10.71% పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

మరోవైపు పోలింగ్‌ కేంద్రాలకి మొబైల్‌ ఫోన్‌ తీసుకువెళ్ల కూడదన్న సంగతి తెలియక కొంతమంది ఓటర్లు తీసుకెళ్తున్నారు. తీరా అక్కడికి వెళ్లాక సిబ్బంది వారిని లోపలికి అనుమతించడం లేదు. ఫోన్ అక్కడే డిపాజిట్ చేద్దామనుకుంటే డిపాజిట్ సెంటర్లు ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో ఓటర్లు ఓటు వేయకుండానే వెనుదిరుగుతున్నారు. కొంతమంది మళ్లీ వచ్చి ఓటేస్తామని చెబుతూ.. డిపాజిట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news