మాంసం లభ్యతలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్

-

చుక్కా.. ముక్కా.. తెలంగాణలో ఏ ఫంక్షన్ అయినా.. ఏ పార్టీ అయినా ఇవి రెండు ఉండటం పక్కా. అందుకేనేమో తెలంగాణలో మాంసం లభ్యత కూడా ఎక్కువ. ఇదే విషయాన్ని తాజాగా ప్రాథమిక పశుపోషణ గణాంకాల(బేసిక్‌ యానిమల్‌ హస్బెండరీ స్టాటిస్టిక్స్‌) వార్షిక నివేదిక-2023 వెల్లడించింది. దేశంలోనే మాంసం లభ్యతలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ఈ నివేదిక తెలిపింది. అయితే మాంస ఉత్పత్తిలో మాత్రం అయిదో స్థానంలో ఉందని పేర్కొంది. కోడిగుడ్ల తలసరి లభ్యతలో 2, ఉత్పత్తిలో 3.. పాల ఉత్పత్తి, లభ్యతలో 13వ స్థానంలో ఉన్నట్లు ఈ నివేదిక తేల్చింది.

తెలంగాణలో గత నాలుగేళ్లుగా అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ  పథకం కారణంగా మాంసం ఉత్పత్తి, లభ్యత పెరిగాయని అధికారులు చెబుతున్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 1.28 కోట్ల గొర్రెల పంపిణీ చేయగా.. పౌల్ట్రీరంగం కూడా 1500 కోళ్లఫారాలతో పురోగమిస్తోందని వెల్లడించారు. తెలంగాణలో ప్రతి వ్యక్తికి సరాసరిన సంవత్సరానికి అత్యధికంగా 28.51 కిలోలు లభిస్తోందని చెప్పారు. ఉత్పత్తిపరంగా దేశంలో ఏటా 9.77 మిలియన్‌ టన్నులు, రాష్ట్రంలో 1.08 టన్నులు(11.06%)గా ఉందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news