రేవంత్‌ సీఎం అయితే..ఏపీకి మంచి జరుగుతుంది – జెసి ప్రభాకర్ రెడ్డి

-

రేవంత్‌ సీఎం అయితే..ఏపీకి మంచి జరుగుతుందన్నారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి. అనంతపురంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో మంచి పరిపాలన అందించే వ్యక్తికే మా మద్దతు అన్నారు. పార్టీల పరంగా కాకుండా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన అందించే వ్యక్తి ,అందుకే ఆయనకు జై కొట్టామని వివరించారు.

jc prabhakar comments on revanth reddy

రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడేనని..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపిక అయితే ఆంధ్రప్రదేశ్ కు మంచి జరుగుతుందని చెప్పారు. ఐదు నెలల్లో జరిగే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేకత ఉంటుందని వెల్లడించారు. వ్యతి రేకత ను అనుకూలంగా ఉంచుకుంటే విజయం సాధిస్తారు…లేకపోతే పరాజయం పాలవుతా రని చెప్పారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news