నెల్లూరు జిల్లాలో తీరం దాటిన తుపాను.. ఏపీలో దంచికొడుతున్న వర్షాలు

-

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిగ్‌జాం తీవ్రతుపాను మారి నెల్లూరు జిల్లాలో తీరం దాటింది. ఈ తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నారు. మరోవైపు కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుకురుస్తున్నాయి. పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం సూచిస్తోంది.

మిగ్​జాం తుపాను ప్రభావం ఏపీ, చెన్నైలపై తీవ్రంగా పడుతోంది. భారీ వర్షాలతో ఈ రెండు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. రహదారులపైకి నీరు చేరి.. చెట్లు నేలకూలుతూ.. విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఇలా అస్తవ్యస్తమవుతోంది. నెల్లూరు, ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వర్షం, గాలుల తీవ్రత అధికమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుపాను నేపథ్యంలో 8 జిల్లాల్లో 300 పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేయాలని గుర్తించామని ఏపీ సర్కార్ తెలిపింది. 181 ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామని.. 10 కేంద్ర, రాష్ట్ర విపత్తు స్పందన దళాలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించింది. మరోవైపు తుపాను నేపథ్యంలో తీరప్రాంత జిల్లాల్లో పాఠశాలలకు నేడు కూడా సెలవులు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news