కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ హైకమాండ్ బంపర్ ఆఫర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రేవంత్ ను సీఎంగా ఎంపిక చేసిన నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడిగా భట్టికి అవకాశం ఇవ్వడంతో పాటు డిప్యూటీ సీఎం బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క వద్దంటే పొన్నం ప్రభాకర్, మధుయాష్కి, మహేష్ కుమార్, జీవన్ రెడ్డి, మల్లు రవి, షబ్బీర్ ఆలీ పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా, తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. సీఎల్పీగా రేవంత్ రెడ్డి పేరును పార్టీ అగ్రనాయకత్వం దిల్లీలో ప్రకటించింది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈ నెల 7వ తేదీ గురువారం రోజున ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లో కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.