తుపాను ప్రభావంతో తల్లడిల్లుతున్న తెలంగాణ.. తడిసిన ధాన్యం.. వేల ఎకరాల్లో పత్తికి నష్టం

-

మిగ్‌జాం తుపాను ప్రభావం తెలంగాణ రాష్ట్రాన్నీ కుదిపేస్తోంది. ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ సరిహద్దు జిల్లా అయిన ఉమ్మడి ఖమ్మం జిల్లా తడిసిముద్దవుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షాలకు ప్రజలు వణికిపోతున్నారు. ఇక ఇవాళ కూడా పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.

మంగళవారం రోజున కురిసిన వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగాకోతలు కోతకు వచ్చిన పైరుతో పాటు కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. పొలాల్లో వరదనీరు చేరి ధాన్యం కొట్టుకుపోయింది. వేల క్వింటాాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరగా టార్పాలిన్లు సరిపోక అక్కడి ధాన్యం కూడా తడిసిపోయింది. గోదాములకు తరలించకుండా మార్కెట్లలో ఆరుబయట ఉంచిన ధాన్యం సైతం తడిచింది.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల ఎకరాల్లో పత్తిని పంట తడిసిపోయింది. కొన్ని ప్రాంతాల్లో పొలాల్లోనే నిల్వ ఉంచిన ఏరిన పత్తి తడిసిపోయింది. మరి కొన్ని ప్రాంతాల్లో కోత దశలో ఉన్న మిర్చి రాలిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news