ప్రపంచ సగటులో భారత్‌ ఉద్గారాలు సగమే.. ‘గ్లోబల్‌ కార్బన్‌ ప్రాజెక్టు-2022’ నివేదిక

-

గతేడాదిలో కార్బన్‌ డయాక్సైడ్‌ (సీవో2) వెలువరించడంలో భారతదేశ సగటు 5% మేర పెరిగిందని ‘గ్లోబల్‌ కార్బన్‌ ప్రాజెక్టు’ -2022 నివేదిక తెలిపింది. అయితే ఇది ప్రపంచ సరాసరిలో సగం కంటే తక్కువేనని పేర్కొంది. వాతావరణ మార్పులపై దుబాయ్‌లో జరుగుతున్న కాప్‌28 సదస్సు నేపథ్యంలో తాజా నివేదికను విడుదల చేసింది.

కర్బన్ ఉద్గారాలు వెలువరించడంలో ప్రపంచంలోనే అమెరికా మొదటి స్థానంలో ఉందని ఈ నివేదిక వెల్లడించింది. అగ్రరాజ్యంలో ప్రతి పౌరుడి వల్ల సగటు సీవో2 ఉద్గారాలు 14.9 టన్నులుగా ఉందని పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో రష్యా (11.4), జపాన్‌ (8.5), చైనా (8), ఐరోపా సమాఖ్య (6.2 టన్నులు) ఉన్నాయని వివరించింది. ప్రపంచవ్యాప్త సగటు 4.7 టన్నులు కాగా.. భారత్‌లో ఇది 2 టన్నులుగా ఉందని తెలిపింది.

మరోవైపు 2011-2020 దశాబ్దంలో భారత్‌లో వేడిమి పెరిగిందని ఐరాసకు చెందిన ‘ప్రపంచ వాతావరణ సంస్థ’ (డబ్ల్యూఎంవో) కాప్‌ సదస్సులో విడుదల చేసిన నివేదిక తెలిపింది. 2023 అత్యంత వేడి సంవత్సరంగా పేర్కొంది. వాతావరణ మార్పుల వల్ల పంట దిగుబడులపై, నీటి లభ్యతపై ప్రభావం పడుతోందన్న డబ్ల్యూఎంవో..  ధ్రువ ప్రాంతాల్లో మంచు కరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news