ఈ వారం మొదటి నుండి నిన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో మిచౌన్గ్ తుఫాన్ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది అని చెప్పాలి. ఈ తుఫాన్ కారణంగా ప్రజలు చాలా నష్టపోయారు, ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో అయితే చేతికి అందవలసిన పంటలు వర్షం దెబ్బకు భూమిలో కలిసిపోయాయి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ జరుగుతుండగా వర్షం కారణంగా వరి సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. ఈ పరిస్థితిని తమ స్వార్దానికి వినియోగించుకున్నారు బియ్యం వ్యాపారులు. ఈ తుఫాన్ అనంతరం బియ్యం ధరలు చూస్తే అవాక్కవల్సిందే.. గత నెలలో మేలు రకం బియ్యం ధర 26 కేజీల బస్తా సగటున 1250 నుండి 1300 ఉండగా, ఇప్పుడు చూస్తే ఆ ధర ఆసాంతం 1500 నుండి 1600 కు చేరింది.
ఇక తెలుస్తున్న సమాచారం ఈ బియ్యం ధరలు ముందు ముందు ఇనక పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. కాగా ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ సమస్యను తగ్గించాలని ప్రజలు కోరుకుంటున్నారు.