అధికారం కోసం ఓట్లు అడగను.. మార్పు కోసం నాకు ఓట్లు కావాలి : పవన్ కళ్యాణ్

-

అధికారం కోసం ఓట్లు అడగను.. మార్పు కోసం నాకు ఓట్లు కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాజాగా విశాఖపట్టణం జనసేన సమావేశంలో ఆయన మాట్లాడారు.  యువతరం కోసమే నా ఆలోచన అంతా.. ఈ తరాన్ని కాపాడుతూ.. రాబోయే తరం గురించి పని చేస్తానని తెలిపారు పవన్. ఎన్నికల  ఉత్తరాంద్ర అందరినీ అక్కున చేసుకుంటుంది. 

డబ్బులు లేకున్నా పార్టీని ఒంటి చేతితోనే నడిపిస్తున్నానంటే కారణం ప్రేమాభిమానాలే అని పేర్కొన్నారు. తెలంగాణ యువత బలిదానాలతో తెలంగాణను తెచ్చుకున్నారు. ఎన్నికల గురించి ఎప్పుడూ ఆలోచించనని తెలిపారు. ఈ సమాజం త్యాగాలతోనే నిర్మితమైంది. రాజకీయాలను యువతరం నమ్మడం లేదు. రాజకీయాల్లో యువత పాత్ర ఉండాలి. యువత కూడా రాజకీయాల్లో నిలబడాలి. దెబ్బతిన్నా కానీ.. యువత మళ్లీ రాజకీయాల్లోనే ఉంటే.. రాజకీయాల్లో మార్పు సాధ్యమవుతుంది.

 

నేను మీ భవిష్యత్ కోసం నానా తిట్లు తింటున్నాను. ఉత్తరాంధ్ర ఉపాధి అవకాశాలు ఇక్కడే ఉండేవిధంగా మనస్ఫూర్తిగా కృషి చేస్తున్నాను. రాజకీయాలు కలుషితం అయ్యాయని యువత రావడం లేదు. యువత రాజకీయాల్లోకి వచ్చి కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. తాను ఓటమి చెందినప్పటికీ పోరాడుతూనే ఉన్నాను. అబ్రహం లింకన్ ప్రతీసారి ఓడిపోయాడు. అయినప్పటికీ అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. యుద్ధానికి ప్రిపేర్ అవుతే.. కచ్చితంగా ఏదో ఒకసారి విజయం సాధిస్తాం. ఇందుకు ఉదాహరణ అబ్రహం లింకన్.  

Read more RELATED
Recommended to you

Latest news