AP : గ్రూప్-2 వయోపరిమితి పెంచాలని డిమాండ్

-

గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, అభ్యర్థుల వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 47 ఏళ్లకు పెంచాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏటా నోటిఫికేషన్ రాకపోవడంతో ఎంతో మంది అభ్యర్థులు నిర్దేశిత వయోపరిమితి దాటి అనర్హులయ్యారని చెబుతున్నారు.

Demand to increase the age limit of Group-2

వారందరికీ అవకాశం కల్పించాలని…. స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఇది ఇలా ఉండగా, 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదలైంది.  ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు – 331 కాగా.. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు – 566 విడుదల చేసింది ప్రభుత్వం. గ్రూపు2, గ్రూపు 1 మాత్రమే కాకుండా  జగన్ ప్రభుత్వంలో హాయంలో 6 లక్షల 16 వేల 323 పోస్టులను నియమించింది. ఇన్ని ఉద్యోగాలు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. గ్రూపు 2 నోటిఫికేషన్ విడుదలైన ఒక్క రోజు వ్యవధిలోనే గ్రూప్ 1  నోటిఫికేషన్ విడుదలవ్వడం ఏపీ చరిత్రలోనే రికార్డు అని చెప్పాలి.  ఈ నోటిఫికేషన్ ద్వారా 81 పోస్టులను భర్తీచేయనుంది జగనన్న ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news