టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కు కీలక పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న రాజీవ్ శర్మ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం.
ఈ పోస్టులో కోదండరామ్ ను నియమిస్తారని టాక్. లేదంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ గా కూడా నియమించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఇలా ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెమ్ స్పీకర్ గా వారితో ప్రమాణం చేయిస్తారు. తొలుత సీఎం, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. తిరిగి ఈనెల 13 లేదా 14న ప్రారంభమవుతుంది. కాగా, సిఎస్ శాంతి కుమారి, డిజిపి రవి గుప్తా అసెంబ్లీ ప్రాంగణం లో ఏర్పాట్లు పూర్తిచేశారు.