ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అలిగారు. ఇరాన్‌కు రష్యా సహకారం అందించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు నెతన్యాహు పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఇరాన్‌కు రష్యా సహకారం అదించడం ప్రమాదకరమైనదని పుతిన్‌తో నెతన్యాహు చెప్పినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణ పాటించాలని శనివారం ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ తీర్మానానికి రష్యా మద్దతు ఇవ్వగా.. అమెరికా వీటో అధికారంతో అడ్డుకుంది. అయితే ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా రష్యా ప్రతినిధులు మద్దతు తెలపడంపై నెతన్యాహు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై పుతిన్ స్పందిస్తూ.. ఇరువురి మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు రష్యా అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తుందని చెప్పినట్లు సమాచారం. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని ఖండించి తీరాలని పుతిన్ పేర్కొన్నట్లు మాస్కో వెల్లడించింది. ఉగ్రవాద చర్యలను ఎదుర్కొనే క్రమంలో సామాన్య పౌరులకు ఎలాంటి హాని కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లు తెలిపింది.