11 చోట్ల వైసీపీ ఇంచార్జీలు మార్పు..!

-

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్ సీపీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో పలు నియోజకవర్గాలకు పార్టీ ఇంచార్జీలను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వివరాలను సోమవారం సాయంత్రం సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద మీడియాకు తెలియజేశారు.11 నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జీలను నియమించినట్లు తెలిపారు. స్థాన చలనం జాబితాలో పలువురు మంత్రులు కూడా ఉన్నారు.


గుంటూరు పశ్చిమ-విడుదల రజిని, మంగళగిరి- గంజి చిరంజీవి, పత్తిపాడు- బాలసాని కిషోర్ కుమార్, వేమూరు- అశోక్ బాబు, సంతనూతలపాడు- మేరుగ నాగార్జున, తాడికొండ-మేకతోటి సుచరిత, కొండేపి- ఆదిమూలపు సురేష్, చిలకలూరిపేట- రాజేష్ నాయుడు, అద్దంకి-పాణెం హనీమిరెడ్డి, రేపల్లె- ఈవూరు గణేష్, గాజువాక- వరికూటి రామచంద్ర రావులను నియమించినట్లు తెలిపారు. రేపటి నుంచి పార్టీ వ్యవహారాలను వీరంతా పర్యవేక్షిస్తారు. పార్టీ ఎవరినీ వదులుకోదు. అందరి సేవలనూ వినియోగించుకుంటాం. 175కి 175 సీట్లు సాధించాలనే లక్ష్యంతో పని చేస్తాం. అణగారినవారికి ధైర్యం ఇచ్చి పని చేస్తున్నాం. ఏదో మాటలు చెప్పి చేయటం లేదు. ఏపీ ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలుపే ప్రతిపాదికన ఈ నిర్ణయం తీసుకున్నాం అని బొత్స పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news