శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు వైసీపీ డిపాజిట్‌ స్థానాలు గెలవదు -వైసీపీ ఎంపీ

-

రానున్న ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి మొదలుకొని నెల్లూరు జిల్లా వరకు అధికార వైకాపా సింగిల్ డిజిట్ స్థానాలకే పరిమితం అవుతుందని నరసాపురం రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం నిర్వహించిన ఫ్లాష్ సర్వేలో ఈ విషయం తేటతెల్లమయిందని, టీడీపీ – జనసేన కూటమి, అధికార వైకాపా, కాంగ్రెస్ పార్టీల పేరిట సర్వే నిర్వహించగా, ప్రస్తుత పాలకులకు పట్ల ప్రజలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నారు.

అధికార వైకాపా కడప, చిత్తూరు జిల్లాలతో పాటు అనంతపురంజిల్లాలో ఒకటి రెండు స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితి రోజుకింత దిగజారే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అధికార వైకాపాను వీడిన వారిలో ఐదు మంది ఎమ్మెల్యేలు ఉండగా, అందులో నలుగురు ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికి చెందిన వారేనని గుర్తు చేశారు. వైకాపా పరిస్థితి రోజుకింత దిగజారుతుండడం వల్లే శాసనసభ్యులు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారన్నారు. ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పుడు, డబ్బులు కూడా పని చేయమని ఖమ్మం జిల్లాలోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే స్పష్టమవుతుందని, అధికార పార్టీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వంటి వారు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news