కరోనా సమయంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో మా ఊరి పొలిమేర అనే ఓ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆ మూవీ చివరలో పార్ట్ -2 కూడా ఉంటుందని డైరెక్టర్ హింట్ ఇచ్చాడు. ఇచ్చినట్లుగానే మా ఊరి పొలిమేర-2 సినిమా తీశాడు. అయితే ఫస్ట్ పార్ట్‌కు ఓటీటీలో వచ్చిన రెస్పాన్స్ చూసి సెకండ్ పార్ట్‌ను థియేటర్లో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే నవంబర్ 3వ తేదీన మా ఊరి పొలిమేర2 చిత్రం థియేటర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకుంది.
సత్యం రాజేశ్, కామాక్షి భాస్కరాల, గెటప్ శ్రీను, బాలాదిత్య కీలక పాత్రల్లో నటించిన క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఓటీటీలో విడుదలైన ‘మా ఊరి పొలిమేర’కు మించి ట్విస్ట్‌లతో అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. ఈ సినిమాతో నటుడు సత్యం రాజేశ్ మరో మెట్టు ఎక్కారు. తాజాగా ఈ చిత్రం ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే థియేటర్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డు వ్యూస్‌తో ప్రేక్షకాదరణ పొందుతోంది. ఇప్పటివరకూ ఈ మూవీని ఆహాలో 100 మిలియన్ + వ్యూయింగ్ మినిట్స్ వీక్షణలను సొంతం చేసుకుని, రికార్డు సృష్టించింది.