స్పీకర్‌ పదవికి నామినేషన్‌ వేసిన గడ్డం ప్రసాద్‌కుమార్‌

-

తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క పాల్గొన్నారు. వారితో పాటు ఎమ్మెల్యేలు కేటీఆర్, కూనంనేని సాంబశివరావు, హరీశ్ రావు కూడా హాజరయ్యారు. సభాపతిగా గడ్డం ప్రసాద్‌ కుమార్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఐ పార్టీ మద్దతిచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ప్రసాద్‌ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్‌పై కేటీఆర్ సంతకం చేశారు. అయితే ఈ ఎన్నికకు బీజేపీ మాత్రం దూరంగా ఉంది. రేపు ఉదయం శాసనసభాపతి ఎన్నిక జరగనుంది. ప్రసాద్ కుమార్ ప్రస్తుతం వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పాలనలో దళితులకు పెద్దపీట వేస్తున్నామనే నేపథ్యంలోనే గడ్డం ప్రసాద్‌ కుమార్​ను స్పీకర్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. సభాపతిగా నియమితులైతే రాష్ట్రానికి తొలి దళిత స్పీకర్‌ ఆయనే కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news