పార్లమెంట్ లో అసాధారణ పరిణామం చోటుచేసుకుంది పార్లమెంటు ఉభయ సభల్లో మొత్తం 81 మంది ఎంపీలు సస్పెన్షన్ గురయ్యారు. ఈరోజు లోక్ సభలో 33 మంది ఎంపీలు రాజ్యసభలో 34 మంది సస్పెండ్ అయ్యారు. గతవారం 14 మంది ఎంపీలు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. పార్లమెంట్ భద్రత వైఫల్యం విపక్షాలు గందరగోళం సృష్టించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లోక్ సభ నేడు 33 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్ భద్రత వైఫల్య అంశంపై లోక్సభలో గందరగోళం సృష్టించడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన ఎంపీలు కాంగ్రెస్ ఫ్లోర్న్ రంజ చౌదరి, డిఎంకె ఎంపీలు టిఆర్ఎస్ ఉన్నారు. ఈరోజు సస్పెండ్ అయిన లోక్ సభ ఎంపీ లో 31 మందిని శీతాకాల సమావేశాలకు సస్పెండ్ చేయగా.. ముగ్గురిని ప్రీవియస్ కమిటీ నివేదిక వచ్చేవరకు సస్పెండ్ చేశారు. ఎంపీలు కే జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ కలీగ్ స్పీకర్ పోడియం పైకి ఎక్కి నినాదాలు చేశారు. ఎంపీల సస్పెన్షన్ ప్రతిపాదనను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సభలో సమర్పించారు. వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదించారు.