రాష్ట్రంలో 20 మంది పోలీస్ ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. డీఐజీ నుంచి డీజీపీ స్థాయి వరకు ఉన్నతాధికారులకు పోస్టింగ్‌లు ఖరారు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ను రాష్ట్ర ప్రభుత్వం రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో ఆయన రాష్ట్ర డీజీపీగా ఉన్న విషయం తెలిసిందే.
శాసనసభ ఎన్నికల ఫలితాల రోజున అంజనీ కుమార్ (అప్పుడు తెలంగాణ డీజీపీ పదవిలో ఉన్నారు) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. ఫలితాలు వెలువడక ముందే ఆయణ్ను కలవడంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘం అంజనీ కుమార్ను సస్పెండ్ చేసింది. అనంతరం వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రేవంత్ పిలిస్తేనే వెళ్లాలనని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని సీఈసీకి అంజనీ కుమార్ తెలిపారు. ఆయన అభ్యర్థన మేరకు సస్పెన్షన్ ఎత్తివేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతా విభాగం చైర్మన్ గా అంజనీ కుమార్ను నియమించింది.