తాను ఎక్కడికి పారిపోలేదు.. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్..!

-

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్   గజ్వేల్ (మం) కోల్గురు లో ఇంటి వద్దే ఉన్నాడు. తనపై జరుగుతున్న ప్రచారంపై కన్నీరు పెట్టుకున్న ప్రశాంత్  బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ ప్రశాంత్. తాను ఎక్కడికి పారిపోలేదు అంటూ వివరణ ఇచ్చారు. తన విజయాన్ని ఓర్వలేకే కొందరూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ భావోద్వేగానికి గురయ్యారు.

జై జవాన్ జై కిసాన్.. అన్నా నేను ఏడికీ పోలే.. అవన్నీ తప్పుడు సమాచారాలు.. నేను ఇంటికాడనే ఉన్నా.. బరాబర్ ఇంటికాడనే ఉన్నా.. అన్నా వాళ్లు కూడా ఈడే ఉన్నారు.. కావాలంటే అయ్యప్ప స్వాములతో కూడా మాట్లాడిస్తా చూడండి.. స్వామీ మీరే చెప్పాలి నేను ఎటు ఎటో పోయినా అంటుర్రు.. మీరే చెప్పండి” అంటూ తన పక్కన ఉన్న స్వాములతో మాట్లాడించాడు ప్రశాంత్.

పల్లవి ప్రశాంత్ ఏడికీ పోలేదు.. ఇంటికాడే ఉన్నాడు.. నిన్న పడి పూజ ఉండే.. ప్రశాంత్ నువ్వు ఖచ్చితంగా రావాలి అని పిలిచినా.. ఎప్పుడూ వచ్చేటోడే.. అయితే అందరూ ఇంటికి వస్తుర్రు అన్నా.. నేను ఫొటోలు దిగకపోతే బావుండదు.. దూరం దూరం నుంచి వచ్చిర్రు.. నువ్వు ఎప్పుడూ కలిసోటేడివే.. జర ఏమనుకోకు తప్పు అయింది అన్నాడు.. సరే నువ్వు ఏం టెన్షన్ పడకు ప్రశాంత్.. నేనే నీ దగ్గరి వస్తానని నేనే వచ్చినా.. ఇందాక న్యూస్ ఛానల్స్‌లో ప్రశాంత్ పరారీలో ఉన్నాడు.. అక్కడున్నాడు ఇక్కడున్నాడని వేస్తుర్రు.. అవన్నీ అబద్ధాలు ప్రశాంత్ ఈడనే ఉన్నాడు.. తప్పుడు వార్తలు పెట్టకండి.. ఎందుకంటే ఒక మనిషి జీవితమిది..” అంటూ ఆ స్వామి మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news