పీవీ నరసింహారావు తెలంగాణలో పుట్టడం గర్వంగా ఫీల్ అవుతున్నా : మంత్రి భట్టి విక్రమార్క

-

మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత దేశ ప్రధానిగా, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారు అని చెప్పుకొచ్చారు. పీవీ తెలంగాణలో పుట్టడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. చిన్ననాటి నుంచే పీవీకి దేశం అంటే ప్రేమ. అనేక భాషలపై ఆయనకు మంచి పట్టు ఉందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూసంస్కరణల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న మహానుభావుడు పీవీ నరసింహారావు అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

పీవీ నరసింహారావు ఎన్నో గొప్ప సాహస నిర్ణయాలు తీసుకున్నారు అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. పీవీ పాలనా దక్షత ఇతర రాష్ట్రాలకు ఉదాహరణగా నిలిచింది. పీవీ పాలనా అనుభవం అందరికీ స్ఫూర్తిదాయకం. దేశం ఆర్థికంగా రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానిగా పీవీ కీలక భూమిక పోషించారు. పీవీ పాలనా దక్షత అనితర సాధ్యమని ఆయన చెప్పుకొచ్చారు. గొప్ప మహానుభావుడు అయిన పీవీని దేశానికి అందించిన కాంగ్రెస్ కు కృతజ్ఞతలు. పీవీ ఆలోచనలను, మార్గాన్ని ముందుకు తీసుకు వెళ్ళేందుకు భవిష్యత్ తరాలు నడుం బిగించాలి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news