సలార్ రెండో రోజు కలెక్షన్స్ ఎంత అంటే..?

-

రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా భారీ అంచనాలతో వచ్చిన ‘సలార్‌’ చిత్రం బాక్సాఫీసు దగ్గర దుమ్మురేపుతోంది. సంచలన వసూళ్లను సాధిస్తూ దూసుకెళుతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రికార్డు స్థాయిలో రూ. 178.7 కోట్ల వసూళ్లను రాబట్టిందని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రెండో రోజులకు గానూ ఈ సినిమా వసూళ్లు చేసిన కలెక్షన్ల వివరాలను కూడా మేకర్స్ వదిలారు.

ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ‘సలార్’ రెండో రోజు కూడా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. మూడో రోజు ఆదివారం, నాలుగో రోజు క్రిస్మస్ హాలీడే కూడా యాడవ్వడంతో.. మొత్తంగా నాలుగు రోజులకు ‘సలార్’ కలెక్షన్స్ రికార్డ్స్ బ్రేక్ చేయడం కాయమని, కలెక్షన్ల ‘వరద’ కన్ఫర్మ్ అని ట్రేడ్ నిపుణులు చెబుతుండటం విశేషం. ‘బాహుబలి’ తర్వాత సరైన సినిమా లేక నిరాశలో ఉన్న ప్రభాస్ అభిమానులకు.. ‘సలార్’ చిత్రం ఫుల్ మీల్స్ ఇచ్చేందనే చెప్పుకోవాలి. సినిమా చూసిన వాళ్లంతా.. ప్రభాస్ కటౌట్‌కి సరిపడా సినిమా ఇదంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

 

Read more RELATED
Recommended to you

Latest news