వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టు విచారణ 28కి వాయిదా

-

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మించిన వ్యూహం సినిమాపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమా రిలీజ్ పై స్టే ఇవ్వాలని ధర్మసనాన్ని కోరారు పిటీషనర్ న్యాయవాది. అయితే స్టే కి హైకోర్టు నిరాకరించింది.

ఈనెల 28న మరోసారి విచారించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది హైకోర్టు. 28న వాదనలు వినిపిస్తామని ప్రొడ్యూసర్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టుకి విన్నవించారు. అయితే టిడిపి తరఫున వాదనలు వినిపించిన మురళీధర్ రావు పలు కీలక ఆరోపణలు చేశారు. వ్యూహం సినిమా కేవలం పొలిటికల్ అజెండాతోనే రూపొందించారని.. టిడిపి, జనసేన, కాంగ్రెస్ నాయకులను డీ ఫేమ్ చేసేలా ఈ సినిమా తీశారని ఆరోపించారు.

సోనియా, మన్మోహన్, రోశయ్య పాత్రలను నెగిటివ్ గా చూపించారని అన్నారు. సెన్సార్ బోర్డుకి దీనిపై ఫిర్యాదు చేశామన్నారు. ఓ రివ్యూ కమిటీ వ్యూహం సినిమాపై రిపోర్ట్ కూడా ఇచ్చిందన్నారు టిడిపి తరపు న్యాయవాది. సీఎం జగన్ కి అనుకూలంగా ఈ చిత్రాన్ని రూపొందించారని.. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ని రద్దు చేయాలని కోరుతున్నామన్నారు. ఈ సినిమా వల్ల త్వరలో జరగబోయే ఎన్నికల మీద తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. వ్యూహం సినిమా మొత్తాన్ని చంద్రబాబుని కించపరచడానికే తీసారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news