సీఎం జగన్ నమ్మకద్రోహానికి ప్రతిరూపం – మాజీ మంత్రి పుల్లారావు

-

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ నమ్మకద్రోహానికి ప్రతిరూపం అని విమర్శించారు. ఉద్యోగులు, కార్మికులు చివరికి తన వెంట నడిచిన ఎమ్మెల్యేలకు కూడా ద్రోహం చేశారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి 57 నెలల పాలనలో అన్ని వర్గాలను నయవంచన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే అనగదొక్కుతున్నారని మండిపడ్డారు ప్రత్తిపాటి పుల్లారావు. సొంత చిన్నాన్నను చంపిన వాళ్లని రక్షిస్తున్న జగన్ ని ఏమనాలి అని ప్రశ్నించారు. అమరావతి రైతులను నమ్మించి జగన్ రోడ్డున పడేసాడని.. పేద ప్రజలు, నిరుద్యోగుల్ని మోసం చేసి ప్రశ్నిస్తే అరగదొక్కుతున్నారని మండిపడ్డారు. దళితులు, బీసీలను నమ్మించి గొంతు కోసి వాళ్లకు అన్యాయం చేశారని విమర్శించారు. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news