IND vs SA: టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా.. భారత్ ఫస్ట్ బ్యాటింగ్

-

రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా నేడు సెంచూరియన్ వేదికగా భారత్ – దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయింది. సఫారీ గడ్డపై టెస్టుల్లో తొలిసారి సిరీస్ సొంతం చేసుకోవాలని లక్ష్యంతో టీం ఇండియా బరిలోకి దిగింది. ఈ క్రమంలో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా మొదట బౌలింగ్ ఎంచుకుంది.

కాగా 30 ఏళ్లుగా సౌత్ ఆఫ్రికాపై భారత్ ఒక్క టేస్ట్ సిరీస్ కూడా గెలవలేదు. తెలంగాణ ఇప్పటివరకు ఎనిమిది సిరీస్ లు జరగగా.. ఏడింటిలో ఓటమిపాలైన భారత్, ఒక్క డ్రా తో సరిపెట్టుకుంది. ఇక ఈ మ్యాచ్ లో స్టార్ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ భారత్ తరపున అరంగేట్రం చేశారు.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, గిల్, విరాట్ కోహ్లీ, కె.ఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఆర్ అశ్విన్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రిత్ బూమ్రా, సిరాజ్ ప్రసిద్ద్ కృష్ణ.

సౌత్ ఆఫ్రికా: డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్రామ్, టోనీ డి జోర్జి, టెంబా బావుమా(సి), డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రెయిన్నే(w), మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబడ, లుంగీ న్గిడి, కీగన్ పీటర్సన్, వియాన్ ముల్డర్, నాన్ మల్డర్ , ట్రిస్టన్ స్టబ్స్.

Read more RELATED
Recommended to you

Latest news