మన్మోహన్, నడ్డా సహా రాజ్యసభకు 55మంది వీడ్కోలు

-

వచ్చే ఏడాది ఏప్రిల్లో రాజ్యసభ సభ్యుకు 55 మంది వీడ్కోలు పలకనున్నారు. అత్యధికంగా 27 మంది బీజేపీకి చెందిన నేతలు పదవీ విరమణ చేయనున్నారు. 10 మంది కాంగ్రెస్‌ నేతలు, తెలుగు రాష్ట్రాల పార్టీలు బీఆర్ఎస్ నుంచి ముగ్గురు, టీడీపీ, వైఎస్సార్సీపీల నుంచి ఒక్కొక్కరు ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఈ స్థానాల భర్తీకి మార్చిలోనే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఏప్రిల్‌లో ఎగువ సభకు వీడ్కోలు పలకనున్న బీజేపీ నేతల్లో ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, అశ్వినీ వైష్ణవ్‌, మన్‌సుఖ్‌ మాండవీయ, భూపేందర్‌ యాదవ్‌, నారాయణ రాణే, పరుషోత్తమ్‌ రూపాలా, రాజీవ్‌ చంద్రశేఖర్‌, వి.మురళీధరన్‌, ఎల్‌.మురుగన్‌ ఉన్నారు.

పు రాజ్యసభకు మార్చిలో జరిగే ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీకు ఆరు, సమాజ్‌వాదీ పార్టీకి మూడు సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. మహారాష్ట్రలోని ఆరు సీట్లను కమలదళం, ప్రతిపక్షాలు ప్రస్తుతం ఉన్నట్లే సగం సగం పంచుకోవచ్చని సమాచారం. బిహార్‌లో జేడీయూ, ఆర్‌జేడీ కూటమి మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవడం దాదాపుగా ఖాయమే. గుజరాత్‌లో రెండు సీట్లను కాంగ్రెస్‌ నుంచి బీజేపీ లాగేసుకునే అవకాశాలుండగా.. రాజస్థాన్‌లో కూడా మరో సీటును అధికంగా గెలుచుకుని ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌ల్లో ఇప్పుడున్న బలాన్ని నిలబెట్టుకునే వీలుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని స్థానాన్ని హస్తం పార్టీకి కమలదళం కోల్పోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news