నేడు తెలంగాణకు రానున్న అమిత్ షా

-

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల్లో పునరావృతం కాకుండా బీజేపీ జాగ్రత్త పడుతోంది. ఓటు శాతం పెరిగినా గెలిచే సీట్ల శాతం కూడా పెంచుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర విభాగం నేడు విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హాజరు కానున్నారు.

రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లోని శ్లోక కన్వెన్షన్‌లో నిర్వహించే ఈ సమావేశానికి మండల నుంచి రాష్ట్రస్థాయి నేతల వరకు హాజరు కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమీక్షతోపాటు, లోక్‌సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను అమిత్‌ షా సన్నద్ధం చేయనున్నారు. మధ్యాహ్నాం ఒంటిగంట 25 నిమిషాలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన నేరుగా నొవాటెల్‌కు వెళతారు.

అక్కడ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. తర్వాత ఛార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించనున్నారు. అనంతరం శ్లోక కన్వెన్షన్‌కు వెళ్లి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన తర్వాత సాయంత్రం 6 గంటలకు తిరిగి దిల్లీ వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news