BREAKING :తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల….

-

తెలంగాణలో ఇంటర్ పరీక్ష షెడ్యూల్ ను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు గురువారం ప్రకటించింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 19 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని తెలిపింది.ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. రెండు సెషన్స్ లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని… రెండవ సెషన్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష షెడ్యూల్ :

*ఫిబ్రవరి 28న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1.

*మార్చి 1న ఆంగ్ల పరీక్ష పేపర్ 1.

*మార్చి 4న మ్యాథమెటిక్స్ పేపర్ 1A/ బోటనీ పేపర్ 1/ పొలిటికల్ సైన్స్ పేపర్ 1.

*మార్చి 6న మ్యాథమెటిక్స్ పేపర్ 1b, జువాలజి పేపర్ 1/ చరిత్ర పేపర్ 1.

*మార్చి 11న భౌతిక శాస్త్రం పేపర్ 1/ ఎకనామిక్స్ పేపర్1.

*మార్చి 13న రసాయన శాస్త్రం పేపర్ 1, కామర్స్ పేపర్ 1.

 

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్ష షెడ్యూల్

*ఫిబ్రవరి 29న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 ►మార్చి 2న ఆంగ్లం పరీక్ష పేపర్ 2

*మార్చి 5న మ్యాథమెటిక్స్ పేపర్ 2A/ బాటనీ పేపర్ 2/ పొలిటికల్ సైన్స్ 2.

* మార్చి 7న మ్యాథమెటిక్స్ పేపర్ 2B/ జువాలాజీ 2/ హిస్టరీ పేపర్ 2

*మార్చి 12న భౌతిక శాస్త్రం పేపర్2/ఎకనామిక్స్ పేపర్ 2.

*మార్చి 14న రసాయన శాస్త్రం పేపర్ 2/ కామర్స్ పేపర్ 2.

Read more RELATED
Recommended to you

Latest news