గోల్డెన్ జూబ్లీ అవార్డు అందుకున్న సూపర్ స్టార్ ర‌జినీ కాంత్‌..

-

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయనకి ఫ్యాన్స్ దేశ నలుములాల కూడా ఉన్నారు. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే 50వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకలు ప్ర‌తి సంవత్సరం గోవాలో ఘనంగా జరుగుతాయి. అయితే బుధవారం (నవంబర్ 20, 2019)న ఈ అవార్డు వేడుకలు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ప్రతిష్టాత్మక ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డుతో సత్కరించారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా రజనీకాంత్ ఈ అవార్డు అందుకున్నారు.

ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని రజనీకాంత్ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఇక రజనీకాంత్ తనకొచ్చిన ఈ అవార్డును తన నిర్మాతలు, డైరెక్టర్లు, తనతో పనిచేసిన సాంకేతిక నిపుణులతో పాటు తన ఫ్యాన్స్‌కు అంకితమిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఈ గెల్డెన్ జూబ్లీ వేడుకల్లో కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో ముఖ్యఅథితులుగా పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news