తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదికను డీజీపీ రవి గుప్తా విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల పర్యవేక్షణ కోసం మరింత శ్రమిస్తామని ఆయన తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 8.97 శాతం నేరాలు పెరిగాయని.. ఒక శాతం రహదారి ప్రమాదాలు తగ్గాయని వెల్లడించారు. 41 శాతం కోర్టు శిక్షలు పెరిగాయన్న డీజీపీ.. జీవిత ఖైదు 39 శాతం పెరిగిందని చెప్పారు. నేరాలకు పాల్పడుతున్న 175 మంది నేరగాళ్లపై పీడీ చట్టం ప్రయోగించినట్లు వివరించారు.
“89,783 సైబర్ మోసాల ఫిర్యాదులు నమోదు చేశాం. దేశం మొత్తంలో ఇది 8 శాతంగా ఉంది. రాష్ట్రంలో 14,271 కేసులు నమోదు చేయగా దేశంలోనే తెలంగాణ కేసుల నమోదులో ముందుంది. సైబర్ మోసాల పిర్యాదుల ఆధారంగా కేసుల నమోదులో తెలంగాణ 16శాతంతో మూడు వరుసలో ఉంది. దేశంలో ఇది 2.5 శాతంగా ఉంది. సైబర్ మాసాల్లో 133 కోట్ల రూపాయల అనుమానాస్పద లావాదేవీలు పోలీసులు సీజ్ చేశారు. 7.7కోట్ల రూపాయల మొత్తం బాధితులకు తిరిగి అందజేశాం. 342 మంది సైబర్ నిందితుల అరెస్ట్ చేశాం.” అని డీజీపీ రవిగుప్తా వెల్లడించారు.