వైసీపీ పై ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు

-

 

వైకాపాలో నలుగురితో ప్రారంభమైన ముసలం నాలుగు నెలల వ్యవధిలో 40 మందికి చేరుకుంటుందని తాను అప్పుడే చెప్పానని రఘురామకృష్ణ రాజు గుర్తు చేశారు. నలుగురి కంటే మొదలే తన ఒక్కడితోనే ఎప్పుడో వైకాపాలో తిరుగుబాటు మొదలయ్యిందని, ఇప్పుడు ఆ 40 మంది సంఖ్య కాస్తా 80 కి చేరుకోనుందని అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు ఏమి మాట్లాడినా ప్రజా సంక్షేమం కోసం వారు కలిసే ముందుకు నడుస్తారని అన్నారు.

అలాగే ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే బీజేపీలోని ప్రముఖ నాయకులు… టీడీపీ, జనసేన కూటమితో పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తాను చెప్పేది మహా నాయకుల గురించి మాత్రమే తప్పితే, గోముఖ వ్యాగ్రాల గురించి కాదని అన్నారు. అయినా ప్రత్యర్థిని ఓడించడానికి, మూడు పార్టీల కలయిక పెద్దగా అవసరం లేదని, కూలిపోయిన ఆంధ్ర ప్రదేశ్ ను నిలబెట్టడం కోసం, ఆగిపోయిన అమరావతి అభివృద్ధిని పునరుద్ధరించడం కోసం, పోలవరం ద్వారా నీటిని పారించడం కోసం ఈ మూడు పార్టీలు కలిసి పోటీచేయాలని భావిస్తున్నాయని అన్నారు. ఆంధ్రులంతా, ఈ మూడు పార్టీల కూటమికి అద్వితీయమైన విజయాన్ని అందించాలని, ఇప్పుడున్న పాలకులకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ మాదిరిగా ఘోర పరాజయాన్ని రుచి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరిని పేరుపేరునా అభ్యర్థిస్తున్నానని రఘురామకృష్ణ రాజు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news