జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్ జపాన్ లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. భూకంపం జపాన్ ను ఒక్కసారిగా కుదిపేసింది. రిక్టర్ స్కేలు పై 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇష్కావా, నిగాటా, టోయమా ప్రాంతంలో అలలు భారీగా ఎగిసి పడుతున్నాయి. ఈ ప్రాంతాల్లో సునామీ వస్తుందని హెచ్చరించారు. మధ్య జపాన్ లో 7.6 తీవ్రతతో ఉంది. తీర ప్రాంతం నుంచి అధికారులు ఇప్పటికే ఖాళీ చేయించారు. ఇప్పటికే 5 మీటర్ల మేరకు అలలు పైకి ఎగిసిపడుతున్నట్టు సమాచారం
.
భారీ భూప్రకంపనల ధాటికి జపాన్ రాధాని టోక్యో, కాంటో ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్లు జపాన్ టైమ్స్ వెల్లడించింది. అయితే, ఈ భూప్రకంపనల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు భారీ భూకంపం నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. 5 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని.. ముందు జాగ్రత్తగా ప్రజలు వెంటనే తీర ప్రాంతాలను వదిలి వెళ్లాలని ఆదేశించింది.