ఆటో డ్రైవర్లు కీలక నిర్ణయం.. 04న మహాధర్నాకు పిలుపు

-

తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత 6గ్యారెంటీ హామీలలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన విషయం విధితమే. ఈ తరుణంలో మహాలక్ష్మీ పథకంలో భాగంగా డిసెంబర్ 09 నుంచి వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఇప్పటివరకు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించే వారు ఇప్పుడు ఆర్టీసీ బస్సులకే మొగ్గు చూపుతున్నారు.

దీంతో బస్సులు ఎక్కేందుకు కూడా స్థలం దొరకని పరిస్థితి నెలకొంది. మహిళలు ఎక్కువగా బస్సుల్లో ప్రయాణిస్తుండటంతో ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం తమనేదనని అభ్యంతరం వ్యక్తం చేసారు. ప్రయాణికులను ఎక్కించకపోవడంతో రోజు వారి ఆదాయం కోల్పోయామని.. కుటుంబాలను ఎలా పోషించుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుమార్లు ఆటో డ్రైవర్లు నిరసనలు తెలిపారు. ప్రభుత్వ అధికారులతో కూడా సమావేశం అయ్యారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 04న ఇందిరా పార్కు వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చారు ఆటో డ్రైవర్లు.

Read more RELATED
Recommended to you

Latest news