Sankranthi festival : ప్రయాణికులకు గుడ్ న్యూస్..! సంక్రాంతి స్పెషల్‌.. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు

-

సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీని తగ్గించే ప్రయత్నంలో పలు మార్గాల్లో స్పెషల్ ట్రైన్స్ నడుపనున్నట్టు ప్రకటించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌ నుంచి కాకినాడకు, తిరిగి సికింద్రాబాద్‌ నుంచి నర్సాపూర్‌,కాచిగూడ-భువనేశ్వర్‌, హైదరాబాద్‌-కొచ్చువేలి,సికింద్రాబాద్‌-గూడూరుకు 32 ప్రత్యేక హమ్‌సఫర్‌/సువిదా రైళ్లు నడపాలని అధికారులు ప్రకటన జారీ చేశారు.

– హైదరాబాద్-కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు జనవరి 13 న, కాకినాడ టౌన్-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు జనవరి 18న బయల్దేరును.

– సికింద్రాబాద్-నర్సాపూర్ సువిధ ప్రత్యేక రైలు జనవరి 12వ తేదీ బయలుదేరుతుంది.

– హైదరాబాద్-కొచువేలి ప్రత్యేక రైలు జనవరి 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24, మార్చి 3, 10, 17, 24 మరియు 31 బయలుదేరును.

తిరుగు ప్రయాణంలో, రైలు జనవరి 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 26, మార్చి 5, 12, 19, 26 మరియు ఏప్రిల్ 2 తేదీలలో కొచ్చువేలి నుండి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకుంటుంది.

– కాచిగూడ-భువనేశ్వర్ హమ్‌సఫర్ ప్రత్యేక రైలు జనవరి 12, 19 మరియు 26 తేదీలలో కాచిగూడ నుండి భువనేశ్వర్ చేరుకుంటుంది.

– సికింద్రాబాద్-గూడూరు ప్రత్యేక రైలు జనవరి 11వ తేదీన బయలుదేరి తర్వాత గూడూరు చేరుకుంటుంది.

– నర్సాపూర్-సికింద్రాబాద్ సువిధ ప్రత్యేక రైలు జనవరి 17 న నర్సాపూర్ నుండి బయలుదేరుతుంది

– రైలు 12590 సికింద్రాబాద్-గోరఖ్‌పూర్ జనవరి 12వ తేదీన సికింద్రాబాద్‌లో బయలుదేరును.

Read more RELATED
Recommended to you

Latest news