‘యాత్ర 2’ టీజర్ వచ్చేస్తుంది.. పెద్దాయన మ్యాజిక్ రిపీట్.. చరిత్రని మరోసారి తిరగరాయబోతుందా?

-

దివంగత నేత, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ‘యాత్ర’ చిత్రం అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మొత్తం జగన్ నామస్మరణం చేస్తున్న రోజుల్లో విడుదలైన ఈ సినిమాకి దాదాపుగా 12 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చి కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ స్టేటస్ ని దక్కించుకుంది. రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం మొదలైన దగ్గర నుండి, ముఖ్యమంత్రి అయ్యేవరకు ఈ సినిమా కథ ఉంటుంది. రెండవ భాగం లో తన కొడుకు జగన్ తో రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న ప్రేమానుబంధం ని , అలాగే రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రాష్ట్రం లో ఏర్పడిన పరిస్థితులు, దాని ద్వారా జగన్ ఎదురుకున్న ఇబ్బందులు, కష్టాలతో పాటుగా, రాజకీయంగా ఒక్కో మెట్టు ఎలా ఎక్కాడు, ముఖ్యమంత్రిగా ఎలా నిలిచాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నాం అంటూ దర్శకుడు మహి వి రాఘవ్ అనేక ఇంటర్వూస్ లో తెలిపాడు.

ఇప్పుడు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం దాదాపుగా పూర్తి అయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెల 8 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. ఈ సినిమాకి మార్కెట్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. విడుదలైతే మొదటి భాగం కంటే పెద్ద హిట్ అవుతుంది అనే నమ్మకం తో ఉన్నారు ట్రేడ్ పండితులు. బిజినెస్ కూడా అన్నీ ప్రాంతాల నుండి ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ చిత్రం లో సీఎం జగన్ గా తమిళ నటుడు జీవా నటిస్తుంటే, మొదటి భాగం లో రాజశేఖర్ రెడ్డి గా నటించిన మమ్ముటి ఈ సినిమాలో కూడా అదే పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని ఈ నెల 5 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు ఆ చిత్ర దర్శకుడు మహి వి రాఘవ్ చెప్పుకొచ్చాడు. ఈ టీజర్ కోసం కేవలం జగన్ అభిమానులు మాత్రమే కాదు, టాలీవుడ్ మొత్తం ఎదురు చూస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news