హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయి ఫేజ్-1లోని సంతోష్‌నగర్ వద్దనున్న 1600 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైన్‌కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. ఈ పనులు బుధవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు గురువారం ఉదయం 6 గంటలకు వరకు జరుగుతాయని అధికారులు వెల్లడించారు.
ఈ 24 గంటల పాటు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. మిరాలం, కిషన్‌బాగ్, అల్జుబైల్కాలనీ, సంతోష్‌నగర్, వినయ్‌నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, అస్మాన్‌గఢ్, యాకుత్‌పుర, మాదన్నపేట్, మహబూబ్ మాన్షన్, రియాసత్‌నగర్, ఆలియాబాద్, బొగ్గులకుంట, అఫ్జల్‌గంజ్, నారాయణగూడ, అడిక్‌మెట్, శివంరోడ్, నల్లకుంట, చిలుకలగూడ, దిల్సుఖ్నగర్, బొంగుళూరు, మన్నెగూడ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని, వినియోగదారులు తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు విజ్ఞప్తి చేశారు.