ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..ఇక మందులు ఫ్రీ డెలివరీ

-

జగనన్న సురక్ష కార్యక్రమం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. ఇందులో భాగంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందుల డెలివరీ కార్యక్రమం ప్రారంభమైంది. గ్రామాలకు వెళ్లిన డాక్టర్లు ఆ రోగులను పరిశీలించి కావాల్సిన మందులను డెలివరీ చేయాలని ఆన్లైన్ లో సిఫారసు చేస్తున్నారు.

Free Door Delivery of Medicines in AP

సెంట్రల్ డ్రగ్ స్టోర్లు తపాలా శాఖ ద్వారా విలేజ్ క్లినిక్ లకు మందుల్ని పంపిస్తున్నారు. CHOలు ఇళ్ళకు వెళ్లి డెలివరీ అందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, ఏపీ సీఎం జగన్ ఇవాళ హైదరాబాదుకు రానున్నారు. ఇటీవల తుంటి మార్పిడి సర్జరీ చేయించుకున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను కలిసి పరామర్శించనున్నారు. కొన్ని రోజులక్రితం ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ జారిపడగా, తుంటి ఎముక విరిగింది. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్న అనంతరం ఆయన తిరిగి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం బంజారాహిల్స్ నందినగర్ నివాసంలో ఉంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news