తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజును విద్యార్థులే స్వయంగా ఆన్లైన్లో చెల్లించే సౌకర్యాన్ని ఇంటర్ బోర్డు తీసుకురానుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీనిని అమలు చేయనుంది.
విద్యార్థులు ప్రస్తుతం కాలేజీల ద్వారా పరీక్ష ఫీజులు చెల్లిస్తుండగా, పలు కాలేజీల్లో అధిక ఫీజును వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో విద్యార్థులకు నేరుగా ఆన్లైన్ లోనే ఫీజు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని బోర్డు నిర్ణయించింది.
ఇది ఇలా ఉండగా, జూనియర్ కాలేజీలకు జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలన్నింటికీ ఈ సెలవులు వర్తిస్తాయని…. యాజమాన్యం విద్యార్థులకు సెలవులు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. ఈ నెల 22 నుంచి 29 వరకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. అటు స్కూళ్లకు ఈ నెల 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు.