ఆ మూడు కోరికలు తీర్చుకుంటున్న లావణ్య త్రిపాఠి !

-

 

మెగా కోడలు లావణ్య త్రిపాఠి మరోసారి అభిమానులకు షాక్ ఇచ్చినట్లు అయ్యింది. ఇటీవల కొన్ని నెలల క్రితం వరుణ్ తేజ్ ని ప్రేమ పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి.. పెళ్లి తర్వాత నుండి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవలే వరుణ్ తో కలిసి హనీమూన్ ట్రిప్ కి ఫిన్లాండ్ కూడా వెళ్లొచ్చింది. ఇక క్రిస్మస్ సెలబ్రేషన్స్ నీ మెగా ఫ్యామిలీతో కలిసి చేసుకుంది. ప్రస్తుతం మెగా కోడలిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ వేళ తన మూడు రిజల్యూషన్స్ ఇవే అంటూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

అయితే ఈ మూడు రిజెల్యూషన్స్ చూసిన నేటిజన్స్ షాక్ అవుతున్నారు. అవేంటంటే.. 1) మంచి హ్యూమన్ బీయింగ్ గా ఉండాలి. 2) నన్ను నేను ఎక్కువగా ప్రేమించుకోవాలి. 3) సోషల్ మీడియాకు తక్కువ సమయం ఇచ్చి.. ప్రకృతితో ఎక్కువ సమయం గడపాలి. అంటూ ఈ మూడింటిని లావణ్య త్రిపాఠి తన న్యూ ఇయర్ రిజల్యూషన్స్ గా పెట్టుకుంది. మరి వీటిని ఎంతవరకు పాటిస్తుందో చూడాలి.

మొత్తానికి లావణ్య త్రిపాఠి ఈ సంవత్సరంలో కచ్చితంగా ఈ మూడు కోరికలను తీర్చుకుంటారని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంత చక్కగా తన లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలో ముందుగానే ఫిక్స్ అయిన పద్ధతిని చూసి మెగా ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక పెళ్లి తర్వాత ఇప్పటివరకు లావణ్య ఏ ఒక్క తెలుగు సినిమాకి కూడా కమిట్ అవ్వలేదు. ప్రస్తుతం లావణ్య చేతిలో ఒక తమిళ్ సినిమా మాత్రమే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news