నేడు UPSC ఛైర్మన్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ

-

దిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. మొదటి రోజున పలువురు కేంద్ర మంత్రులను రేవంత్ కలిశారు. ఇక ఇవాళ యూపీఎస్సీ ఛైర్మన్తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారితో పాటు ఇద్దరు ఐఏఎస్ అధికారులు పాల్గొననున్నారు. మరోవైపు యూపీఎస్సీ పనితీరు, పరీక్షల నిర్వహణను సీఎం బృందం పరిశీలించనుంది. రాష్ట్ర బృందం కేరళ సర్వీస్ కమిషన్ పనితీరు అధ్యయనం చేసిన విషయం తెలిసిందే.

పరీక్షల నిర్వహణను పరీక్షించిన అనంతరం సీఎం రేవంత్ యూపీఎస్సీ ఛైర్మన్తో భేటీ అవుతారు. ఈ భేటీలో టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనపై యూపీఎస్సీ ఛైర్మన్‌తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ కానున్నారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని మార్చడం కోసం యూపీఎస్సీ పరీక్షల నిర్వహణ విధానాలు తెలుసుకోనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వాహణలో వారు అవలంభిస్తున్న విధానాలు తెలుసుకొని టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news