డిసెంబర్ 9వ తేదీ నుండి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పది రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. డిసెంబర్ 9వ తేదీన స్పీకర్ తమ్మినేని సీతారామ్ అద్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు అసెంబ్లీ జరిగేది ఎజెండా తదితర అంశాలు ఖరారయ్యే అవకాశం ఉంది.
ఇసుక , రాజధాని తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇవే అంశాలతో వైసీపీని ఇరుకునపెట్టాలని టీడీపీ భావిస్తోంది. అటు వైసీపీ కూడా ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్లకు ఇప్పటికే సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశం ఉంది.