టీడీపీ బలోపేతానికి పార్టీలో ఎవరైనా చేరవచ్చని, అందులో సిని నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీలో చేరవచ్చని బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ అన్నారు. శ్రీభరత్ ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యాలు చేశారు. రాజకీయాలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎవ్వరైనా టీడీపీలో చేరవచ్చని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీలో చేరవచ్చని అది ఆయన వ్యక్తి విషయమని అన్నారు. పార్టీకి ఏనాడైనా చంద్రబాబు నాయుడే నేత అని శ్రీ భరత్ తెలిపారు.
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైనా పార్టీలో చేరి చంద్రబాబు నాయకత్వంలో పనిచేయవచ్చు.. నందమూరి కుటుంబం నుంచి ఎవరైనా పార్టీలోకి రావచ్చు.. అది జూనియర్ ఎన్టీఆర్ అయినా పర్వాలేదు అని అన్నారు శ్రీ భరత్. జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీలోకి రావద్దని ఎవ్వరు అనలేదని, పార్టీ ఇప్పుడు కష్టకాలంలో ఉన్నందున పార్టీలో చేరి తమతో పాటు పనిచేయవచ్చని అభిప్రాయపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ పాపులర్ సినిమా నటుడు. అయితే ఆయన ఉపన్యాసాలకు మంచి క్రేజీ ఉంటుందని శ్రీభరత్ గుర్తు చేశారు. టీడీపీకి యువరక్తం ఎంతో అవసరం ఉంది. యువకుడైన జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం వస్తుందన్నారు.
జూనియర్ ఎన్టీఆర్‌తో నకు ఎలాంటి విబేధాలు లేవని, ఇద్దరం ఎక్కడ కలిసినా చనువుగానే మాట్లాడుకుంటామని స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ వల్లే టీడీపీ బతుకుతుందనే మాట అవాస్తమన్నారు. పార్టీలోకి ఎందరు వచ్చినా.. సిస్టం బాగుండాలని, అది బాగాలేకపోతే ఎవ్వరు వచ్చినా పార్టీని బతికించలేరని కామెంట్ చేశారు. టీడీపీ సిస్టమ్ బాగుంది.. అందుకే పార్టీ ఇంకా మనుగడలో ఉంది.. ఇంకా పార్టీని 30 ఏండ్లుగా చంద్రబాబు ఓ సిస్టమ్‌లో నడుపుతారని అన్నారు.
పార్టీ ఇంకా 30 ఏండ్ల పాటు బతకాలంటే యువరక్తం రావాల్సిందేనని అన్నారు. పార్టీలోకి యువరక్తాన్ని నింపాల్సిన అవసరం ఉందని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి తాను ఇదివరకే చెప్పానని, తాను తప్పకుండా పార్టీలోకి యువకులను ఆహ్వానించి పార్టీని మరింత బలోపేతం చేద్దామని మాటిచ్చారని, అది చంద్రబాబు నాయుడు చేస్తారనే ఆశ తనకు ఉందని అన్నారు.